»Ooru Peru Bhairavakona How Much Is The Movies Third Day Collections
Ooru Peru Bhairavakona: మూడోరోజు సినిమా కలెక్షన్లు ఎంతంటే?
సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఊరు పేరు భైరవకోన. ప్రీమియర్స్ సోష్తో కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. థియేటర్లోకి వచ్చాక మంచి టాక్ సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం మూడోరోజు కలెక్షన్లు ఎంతో చూద్దాం.
Ooru Peru Bhairavakona: హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తూ సతమతమవుతున్న సందీప్ కిషన్‌కు ఊరు పేరు భైరవ కోన రిజల్ట్ మంచి ఊరటనిచ్చింది. పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఫిబ్రవరి 16న థియేటర్లోకి వచ్చింది. సినిమా మొదటి రోజు నుంచే మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో ఓ రోజు ముందే ప్రీమియర్స్ షోస్ వేశారు మేకర్స్. ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.
Loved the magical entertainer #OoruPeruBhairavakona, Watched it in single screen and the experience was superb! ❤️
Loved the mystical world of Bhairavakona created by @Dir_Vi_Anand 👌🏻
ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.6 కోట్లు వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు మరింత పెరిగాయి. రెండు రోజుల్లో 13 కోట్ల పది లక్షలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉండగా.. సినిమా మూడోరోజు రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్‌గా రూ.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రానున్న వారంలో పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా ఈ మూవీని నిర్మించారు.