కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ తప్పితే.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది ఈ పాన్ ఇండియా ఫిల్మ్. అలాగే హీరోయిన్ విషయంలోను క్లారిటీ రావడం లేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా.. ఎన్టీఆర్ 30 మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఈ విషయంలో నందమూరి అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. స్క్రిప్టు విషయంలో ఎన్టీఆర్, కొరటాల కాంప్రమైజ్ అవకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ డిలే అవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ డిటేయిల్స్ తెలియనున్నాయి.
ఈ క్రమంలో హీరోయిన్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. గతంలో అలియా భట్, సాయి పల్లవి, దిశా పటాని పేర్లు వినిపించగా.. రీసెంట్గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకొచ్చింది. అలాగే క్యూట్ బ్యూటీ రష్మిక పేరు కూడా చాలా రోజులుగా వినిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రష్మిక ఇందులో దాదాపుగా ఓకే అయిందని ఇండస్ట్రీ వర్గాల మాట. అంతేకాదు అమ్మడు 5 కోట్ల వరకు డిమాండ్ చేసిందని కూడా టాక్. ప్రస్తుతం రష్మిక మందన్నకు భారీ క్రేజ్ఉంది. పుష్పతో పాన్ ఇండియా బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దాంతో పారితోషికం కూడా పెంచేసినట్టు వార్తలొస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్ 30కి భారీగానే అందుకోబోతున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి వార్తల్లో అసలు నిజముందా.. లేక కేవలం పుకార్లేనా అనేది తెలియాల్సి ఉంది.