Gold and silver prices today : బంగారం, వెండి కొనుక్కోవాలనుకునే వారికి శుభవార్త. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధర దాదాపుగా రూ. 660 తగ్గింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర(Gold price) రూ.62,180కి చేరింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.600 తగ్గి రూ.57,000కు చేరుకుంది.
మన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్ల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, పూణేల్లో రూ. 57,000గా ఉంది. చెన్నైలో రూ.57,500, ఢిల్లీలో రూ.57,150 పలుకుతోంది.
అలాగే బుధవారం వెండి ధరల్లోనూ(silver prices) తగ్గుదల కనిపించింది. మంగళవారం కిలో వెండి ధర రూ.72,375 ఉండగా బుధవారం నాటికి రూ.1,405 తగ్గి రూ.70,970కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఈ ధరలన్నీ జీఎస్టీ, పన్నులు వేయనివి. దుకాణంలో ఎవరైతే వీటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు సంబంధిత పన్నులను అదనంగా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2018 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 23 డాలర్లు తగ్గి 1993 చేరింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.03 డాలర్లుగా ఉంది.