దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,990కి చేరింది. గురువారం ఈ ధర రూ. 58,000గా ఉంది. ప్రస్తుతం 1 గ్రాము పసిడి ధర 5,799గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా రూ.10 మాత్రమే తగ్గింది. దీంతో దీని ధర ప్రస్తుతం రూ. 63,220గా ఉంది. అలాగే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 6,322గా ఉంది.
ఫెడ్, ఆర్బీఐల వడ్డీ రేట్ల లాంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,990గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,220గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నాల్లోనూ ఈ ధరలే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో సైతం బంగారం రేట్లు(Gold Prices) శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,140గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,320గా ఉంది. అలాగే చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,390గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,710గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల పసిడి రూ. 57,990గాను.. 24 క్యారెట్లది రూ. 63,220గాను ఉంది. అలాగే కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,990 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 63,220గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
వెయ్య తగ్గిన వెండి : దేశంలో వెండి ధరలు(silver prices) శుక్రవారం తగ్గాయి. కేజీ వెండి రూ. 1000 తగ్గి రూ. 73,500కి చేరింది. గురువారం ఈ ధర రూ. 74,500గా ఉండేది. కేజీ వెండి ధర హైదరాబాద్లో రూ. 75,000, కోల్కతాలో రూ. 73,500, బెంగళూరులో రూ. 71,000గా ఉంది.