»Tdp General Secretary Nara Lokesh Got Angry With Cm Jagan In Sankharavam Sabha
Nara Lokesh: జగన్ సైకో.. బాబు బ్రాండ్
జగన్ పేరు చెబితే ఓ ఖైదీ గుర్తుకు వస్తాడు అని, అదే చంద్రబాబు పేరు చెబితే విజన్ ఉన్న నాయకుడు గుర్తుకు వస్తాడు అని నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. జగన్ ఒక బిల్డప్ బాబాబ్ అని అన్నారు. అవినీతి చేసింది ఎవరో ప్రజలకు తెలుసు అని దమ్ముంటూ చర్చకు సిద్దమేనా అని సవాల్ విసిరారు.
TDP General Secretary Nara Lokesh got angry with CM Jagan in Sankharavam Sabha
Nara Lokesh: జగన్ ఒక బిల్డప్ బాబాయ్.. కోట్ల డబ్బులు పెట్టి యాత్ర2 తీశాడు అదే వైసీపీ పార్టీకి అంతిమ యాత్ర అని నారా లోకేష్ అన్నారు. టీడీపీ అభివృద్ధి పనులకు రంగులు, పేర్లు మార్చి అంతా తామే చేశామని చెప్పుకుంటున్న బిల్డప్ బాబయ్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. బాంబులకే భయపడని కుటుంబం మాది మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతమా అని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే పార్టీ శ్రేణులు భయపడుతారని సైకో జగన్ భావించాడని, శ్రీకాకుళం జిల్లా ప్రజల రక్తంలోనే పౌరుషం ఉందన్నారు. మంచి చేసిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని, అన్యాయం చేసిన వారిని ఇక్కడే పాతిపెడతారని పేర్కొన్నారు.
జగన్ అంటే ఖైదీ అని, బాబు అంటే విజన్ అని అన్నారు. ఇటీవల జగన్ మీబిడ్డ మీబిడ్డ అని అంటున్నాడు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, మళ్లీ పొరపాటున గెలిస్తే మీ బిడ్డను కదా మీ భూమిని లాక్కుంటాడు అని లోకేష్ చెప్పారు. గెలిచిన 6 నెలలోపు పని చేస్తే చిత్త శుద్ది అన్న జగన్ ఎన్నికలకు కేవలం నాలుగు నెలలు ఉన్న ఈ సమయంలో మెగా డిఎస్సీ అంటూ డ్రామా చేస్తున్నాడని అన్నారు. లక్షలు పెట్టి కోచింగ్లు తీసుకుంటున్న విద్యార్థులు అధైర్యపడొద్దు అని ఒక్క రెండు నెలలు ఓపిక పడితే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినపుడు 3వేల కోట్ల అవినీతి అని ఆరోపించారు, ఆ తరువాత 275 కోట్లు అన్నారు, ఇక నేడు కేవలం 27 కోట్ల అవినీతి అంటూ అధికారులు చెబుతున్నారు అని ఆరోపించారు. ‘మీ ప్రభుత్వ అవినీతి, మా చిత్తశుద్ధి’ పై చర్చకు ఎప్పుడైనా సరే సిద్ధమే అని, టైము డేటు ఫిక్స్ చేసి చెప్పాలంటూ జగన్కు లోకేష్ సవాల్ విసిరారు.