»North Korea Rained Bombs On An Island Near The South Korean Border
North Korea: దక్షిణ కొరియా సరిహద్దులో అణ్వాయుధ ప్రయోగం చేసిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలిసిందే, తాజాగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించారు. దక్షిణ కొరియా సరిహద్దులో సమీపంలో ఈ ప్రయోగాలు నిర్వహించారు.
North Korea rained bombs on an island near the South Korean border
North Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిమ్ ఎప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటాడు. తాజాగా, దక్షిణ కొరియా సరిహద్దులకు సమీపంలోని ఓ దీవిపై ఉత్తర కొరియా అణ్వాయుధాల ప్రయోగాలు చేపట్టింది. ఇప్పటికే అణు ఆయుధాలు, ఖండాంతర క్షిపణులను ప్రయోగించి అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్న ఉత్తర కొరియా.. కొత్తగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది. ఈ రాకెట్ లాంచర్ నుంచి 240 ఎంఎం ఆర్టిలరీ షెల్స్‌ను దక్షిణ కొరియాకు దగ్గర్లోని ఓ దీవిపై ప్రయోగించింది. ఇది అధికారికంగనే ప్రయోగించినట్లు ఉత్తర కొరియా మీడియా నిర్ధారించింది. ఈ రాకెట్ లాంచర్ పరీక్షల గురించి ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ అధికారికంగా ప్రకటించింది. షెల్ అండ్ బాలిస్టిక్ కంట్రోల్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నట్టు ఆ కథనంలో పేర్కొంది. ఈ నూతన ఆయుధ వ్యవస్థ అభివృద్ధిలో తాజా పరీక్ష కీలకమైనదని కేసీఎన్ఏ వెల్లడించింది.