Kriti Sanon: బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ అందంతో.. నటనతో ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు తన ఖాతాలో కమర్షియల్ హిట్ పడలేదనే చెప్పాలి. ఆ విషయంలో ఆమెను దురదృష్టం వెంటాడుతోంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఆమె నటించిన సినిమాలన్నీ బాగానే ఆడుతున్నా.. కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాయి. సౌత్‌లోని అతిపెద్ద స్టార్లలో ఒకరైన మహేష్ బాబుతో నేనొక్కడినే (2014) అనే సినిమాతో తెలుగులో నటించింది. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తెలుగులో ఆఫర్లు పెద్దగా రాలేదు. అదే సంవత్సరం అల్లు అర్జున్ పరుగు చిత్రానికి రీమేక్‌లో హీరోపంతితో ఆమె హిందీలో అరంగేట్రం చేసింది. అది కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. తరువాత దిల్వాలే (2015) , రాబ్తా (2017) వంటి ప్రాజెక్ట్‌లలో కనిపించింది, వాటిలో దేనికి కూడా మంచి ఆదరణ లభించలేదు. బరేలీ కి బర్ఫీ (2017), ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావ్ నటించిన రొమాంటిక్ కామెడీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలు కాస్త పర్వాలేదనిపించాయి.
కార్తీక్ ఆర్యన్ నటించిన కామెడీ డ్రామా లుకా చుప్పి(2019)తో ఒక కమర్షియల్ హిట్ అందుకుంది. అదే సంవత్సరంలో అర్జున్ పాటియాలా, పానిపట్ ,హౌస్‌ఫుల్ 4లో నటించింది. తర్వాత మిమీ (2021), విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 69వ జాతీయ అవార్డులలో ఆమెను ‘ఉత్తమ నటి’ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత మళ్లీ హిట్ పడింది లేదు.. బచ్చన్ పాండే నుండి హీరోపంతి 2 నుండి భేదియా వరకు వరుసగా మూడు పెద్ద ఎదురుదెబ్బలను ఎదుర్కోవలసి వచ్చింది. తరువాత అలా వైకుంఠపురములో అధికారిక రీమేక్ అయిన షెహజాదా పెద్ద ఫ్లాప్, ఆదిపురుష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆమె తదుపరి సినిమా గణపత్ (2023) కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇటీవల విడుదలైన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా (2024) కాస్త బెటర్ అని చెప్పాలి. వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ కమర్షల్ హిట్ లేక ఈ భామ డీలా పడిపోతుంది.