Telangana: పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వాళ్లను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానించారు. వాళ్లతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యను సత్కరించారు. పద్మశ్రీ అవార్డు అందుకోనున్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు పురస్కారం ప్రకటించారు. అలాగే ప్రతి నెల రూ.25000 పెన్షన్ కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.