W.G: ఆకివీడు వివాదం నేపథ్యంలో దళిత సంఘాలు పిలుపునిచ్చిన ‘ఛలో ఆకివీడు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్‌ను వేమవరంలో ఇవాళ గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రభుత్వం వెంటనే శాంతి కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.