»Assam Bhumi Puja For Setting Up Modis Statue Where
Assam: మోదీ విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే?
మోదీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అస్సాంకు చెందిన నవీన్‌చంద్ర బోరా అనే వ్యాపారవేత్త ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తున్నారు. రూ.200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
Assam: మోదీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అస్సాంకు చెందిన నవీన్‌చంద్ర బోరా అనే వ్యాపారవేత్త ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తున్నారు. రూ.200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వ్యాపారవేత్త రెండు రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్‌కు భూమి పూజ కూడా మొదలుపెట్టారు. అస్సాంకి చెందిన వ్యాపారవేత్త నవీన్‌చంద్ర బోరా గువాహటి నగరానికి సమీపంలో తన స్థలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పీఠభాగంతో కలుపుకొని విగ్రహం ఎత్తు 250 అడుగులు ఉంటుందని నవీన్‌చంద్ర తెలిపారు. విగ్రహం మెడ భాగంలో అస్సాం సంస్కృతికి చిహ్నంగా గమోసా (అసోం ప్రజలు ధరించే ఖద్దరు వస్తం) ఉంటుందని తెలిపారు.
నవీన్ చంద్ర బోరాకు ప్రధాని మోదీ అంటే చాలా అభిమానం. విగ్రహానికి సంబంధించి ఇప్పటికే తుది డిజైన్ ప్లాన్ కూడా సిద్ధమైందని చెప్పారు. అలాగే, విగ్రహ ఏర్పాటు, దానికోసం ఖర్చుచేస్తున్న మొత్తం ఎలా సమకూరుతుందనే వివరాలతో పీఎంఓకి లేఖ రాసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నానని తెలిపారు. ఆయనపై నాకున్న ప్రేమతోనే ఇది చేస్తున్నానని, ప్రపంచంలోని అత్యుత్తమ ప్రధానులలో నరేంద్ర మోదీ ఒకరని నవీన్ తెలిపారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేను ఎంతో అదృష్టవంతుడ్ని అని నవీన్ వ్యాఖ్యనించారు.