Netizens are playing Shoaib Malik's new wife Sana Javed
Shoaib Malik: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవలే మూడో వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే. నటి సనా జావెద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే సనాను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. హైదరాబాద్ టెన్సిస్ స్టార్ సానియా మీర్జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 13 సంవత్సరాలు కలిసున్న వీరు రీసెంట్గా విడాకులు తీసుకున్నారు. సానియాతో సపరేట్ అయిన షోయబ్ ఇటీవల సనాను నిఖా చేసుకున్నాడు. రీసెంట్గా సనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశారు. ఓ దుస్తుల బ్రాండ్‌కు సంబంధించిన ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఒకరి జీవితంలో నిప్పులు పోశావు అని కొందరు కామెంట్లు పెడుతుంటే, ద్వంద్వ ముఖం కలదానివి అని ఒకరు కామెంట్ చేశారు. ఇకపై నీ షోలు చూడబోనని మరొకరు కామెంట్లు చేస్తే.. ఒక మహిళ మరో మహిళ కుటుంబాన్ని విడదీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక షోయాబ్‌ను కూడా నెట్టింట్లో చాలా మంది విమర్శించారు. అయితే సానియా భారతదేశానికి చెందిన క్రీడాకారుణి కాబట్టీ కచ్చింగా భారత్ మద్దతు తనకు లభిస్తుంది. నిజానికి షోయాబ్ చేసిన పనికి పాకిస్తానీలు కూడా తననే విమర్శిస్తున్నట్లు పలు మీడియా కథనాలు వెలువడ్డాయి.
చదవండి:Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది