»Niharika Konidela Niharikas First Reaction On Divorce
Niharika Konidela: విడాకులపై నిహారిక ఫస్ట్ రియాక్షన్!
విడాకుల తర్వాత తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంది మెగా డాటర్ నిహారిక. అయితే ఇప్పటి వరకు నిహారిక తన విడాకులపై ఎక్కడ స్పందించలేదు. కానీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో మాత్రం నిహారిక తన డివోర్స్ పై రియాక్ట్ అయింది.
Niharika Konidela: ఇటీవలె మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2020లో చైతన్య, నిహారికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉందని అనిపించుకుంది. కానీ ఏమైందో ఏమో గానీ.. నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు రావడంతో.. ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం నిహారిక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోది. అలాగే విడాకుల తరువాత కొంత గ్యాప్ తీసుకొని తన కెరీర్ వైపు అడుగులు వేస్తోంది.
అప్పట్లో ఏవో సిరీస్లు, షార్ట్స్ ఫిల్మ్స్ , సినిమాలు చేసిన నిహారిక ఇప్పుడు నిర్మాతగా కూడా సత్తా చాటడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తోంది నిహారిక. ఈ బ్యానర్ పై ఓటీటీకి కంటెంట్ అందిస్తోంది. ఇదిలా ఉంటే.. విడాకుల విషయంపై చాలా రోజుల తర్వాత తొలిసారిగా స్పందించింది నిహారిక. ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల ప్రస్తావన తీసుకొచ్చింది.
తన పెళ్లి బంధం సంవత్సరంలోనే ముగిసిపోతుందని అనుకోలేదని, నా పెళ్లి మిగిల్చిన బాధతో ఎవరినీ ఈజీగా నమ్మకూడదని తెలుసుకున్నాని అని చెప్పింది. అలాగే.. నా ప్రేమ, పెళ్లి అనేవి నాకొక గుణపాఠం అని.. ఇప్పటికీ నా పెళ్లి, విడాకులు గుర్తొస్తే కన్నీళ్లు ఆగవని ఎమోషనల్ అయ్యింది. తాను ఊహించినట్టుగా ఏదీ జరగలేదని అందుకే పెళ్లి బంధాన్ని ముగించేశానని తెలిపింది. ప్రస్తుతం నిహారిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.