»Padma Awards Megastar The Highest Award For Former Vice President
Padma Awards: మెగాస్టార్, మాజీ ఉపరాష్ట్రపతికి అత్యున్నత పురస్కారం
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులుకు కేంద్రం ఎంపిక చేసింది. అత్యున్నతమైన పద్మవిభూషణ్ అవార్డు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కేంద్రం గౌరవించింది.
Padma Awards: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఎంపిక చేసింది. ఈ ఏడాది 132 మందిని పద్మ పురస్కారాలు వరించాయి. అందులో అయిదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులు నలుగురిని వరించాయి. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది.