సిరియా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ నిన్న వైమానిక దాడులు జరిపింది. ఇందులో ఇరాన్ సైనిక సలహాదారులను, హెజ్బొల్లా కమాండర్లను హతమార్చింది. కొందరు చనిపోయగా.. పలువురు గాయాలు పాలయ్యారు.
Isreal: సిరియా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ నిన్న వైమానిక దాడులు చేసింది. ఇరాన్ సైనిక సలహాదారులను, హెజ్బొల్లా కమాండర్లను హతమార్చింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేయగా.. ఆరుగురు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. అలాగే పశ్చిమ డమాస్కస్‌లోని మజ్జెలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న ఓ భవనంలో ఇరాన్ సైనికాధికారుల సమావేశం జరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఇందులో అయిదుగురు ఇరాన్ అధికారులు, ఒక సిరియన్ మృతి చెందారు.
చనిపోయిన అయిదుగురు కూడా ఇరాన్ సలహాదారులే. అలాగే చనిపోయిన వారిలో ముగ్గురు ఇరాన్ కమాండర్లు ఉన్నారని.. మరో నలుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిపింది. అయితే ఈ దాడులు ఏం కొత్త కాదు. గత కొన్నేళ్ల నుంచి సిరియాపై ఇజ్రాయెల్ వందల దాడులు చేస్తోంది. సిరియాలో దాడి చేసిన కొన్న గంటల తర్వాత దక్షిణ లెబనాన్‌లోని పోర్టు నగరరం టైర్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో కారులో వెళ్తున్న ఇద్దరు హెజ్బొల్లా సభ్యులతో పాటు మరో ఇద్దరు మరణించారు. వారిలో అలీ హద్రుజ్ అనే హెజ్బొల్లా కమాండర్ ఉన్నారు.