మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ అప్డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే చాలా రోజులుగా అదిగో, ఇదిగో అనడమే తప్పా.. ఆదిపురుష్ అప్డేట్ మాత్రం రావడం లేదు. దాంతో ‘ఆదిపురుష్’ అప్డేట్ ఎప్పుడు.. అనే క్వశ్చన్ సోషల్ మీడియాలో తరచుగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయినా మేకర్స్ మాత్రం రెస్పాండ్ అవడం లేదు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. అనుకున్న దానికంటే ముందే ఆదిపురుష్ టీజర్ రానుందని తెలుస్తోంది. ఈ మధ్య దర్శకుడు ఓం రౌత్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే కానుకగా ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని ట్రీట్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దాంతో అక్టోబర్ 23 కోసం వెయిటింగ్ అంటున్నారు డార్లింగ్ అభిమానులు.
అయితే ఇప్పుడు ఆదిపురుష్ టీజర్ కాస్త ముందే రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి దసరా వేడుకల్లో ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరగనున్న రావణ దహనానికి ప్రభాస్‌కు అహ్వానం అందినట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ రోజు ఆదిపురుష్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. దసరాకు మిస్ అయినా.. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే ట్రీట్ అదిరిపోవడం ఖాయమంటున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.