ఈ వారం యంగ్ హీరోల మధ్య ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. కిరణ్ అబ్బవరం, సుధీర్ బాబు.. ఈ ఇద్దరికీ కూడా ఆ సినిమాల రిజల్ట్స్ ఎంతో కీలకం కానున్నాయి. దాంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. పోయిన వారం థియేటర్లోకొచ్చిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’, శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా సెప్టెంబర్16న రిలీజ్ కాబోతోంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. దాంతో ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు సుదీర్. పైగా మహేష్ బాబు ప్రమోషన్స్ చేస్తున్నాడు కాబట్టి.. ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ జరిపారు. గతేడాది ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీతో సోసో అనిపించుకున్న సుధీర్.. ఈ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.
ఇక మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మూవీ కూడా అదే రోజు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ అవడంతో. మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. దాంతో సెప్టెంబర్ 14వ తేదీన గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. చివరగా ‘సమ్మతమే’ సినిమాతో మెప్పించలేకపోయిన కిరణ్.. ఈసారి మాస్ కంటెంట్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి మహేష్, పవన్ ఇచ్చిన హైప్‌తో వస్తున్న కిరణ్, సుధీర్.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.