SDPT: చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. విద్యాలయ ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. తరగతి గదిలో విద్యార్థులు ఆప్యాయంగా పలకరించారు. రోజు భోజనం ఎలా ఉంటుంది, మెనూ ప్రకారం పెడుతున్నారా, రుచిగా ఉంటుందా అని ఆరా తీశారు. మంచి క్రమశిక్షణ అలవాట్లను అలవర్చుకోవాలని కోరారు.