»Vinesh Phogat Awards Back Rahul Gandhi Fire On Modi
Vinesh Phogat: అవార్డులు వెనక్కి.. మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
భారత ప్రభుత్వం తన ప్రతిభకు గుర్తింపుగా అందించిన అర్జున, ఖేల్‌రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని భారత మహిళ రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.
Vinesh Phogat: భారత ప్రభుత్వం తన ప్రతిభకు గుర్తింపుగా అందించిన అర్జున, ఖేల్‌రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని భారత మహిళ రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అవార్డులను ఇవ్వడానికి న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా.. కర్తవ్య పథ్ వద్ద ఆమెను పోలీసుల అడ్డుకున్నారు. దీంతో వినేష్ ఫోగట్ తన అవార్డులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దేశంలో మహిళా రెజ్లర్లకు న్యాయం జరగడం లేదని వినేశ్ ఫొగాట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను నా జీవితంలో ఉంచుకోవడంలో ఏ మాత్రం అర్థం లేదని తెలిపారు. ప్రతి మహిళ తన జీవితాన్ని గౌరవంగా జీవించాలని అనుకుంటుంది. ఈక్రమంలో నేను ఆ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాని తెలిపారు.
देश की हर बेटी के लिये आत्मसम्मान पहले है, अन्य कोई भी पदक या सम्मान उसके बाद।
आज क्या एक ‘घोषित बाहुबली’ से मिलने वाले ‘राजनीतिक फायदे’ की कीमत इन बहादुर बेटियों के आंसुओं से अधिक हो गई?
प्रधानमंत्री राष्ट्र का अभिभावक होता है, उसकी ऐसी निष्ठुरता देख पीड़ा होती है। pic.twitter.com/XpoU6mY1w9
ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. యావత్ దేశానికి సంరక్షకుడైన ప్రధాని ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. దేశంలో ప్రతి కూతురికీ ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యం. దాని తర్వాతే ఏదైనా అవార్డు అని అన్నారు. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే బాహుబలిగా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? యావత్ దేశానికి ప్రధానమంత్రి సంరక్షకుడు? ఆయన వైపు నుంచి ఇటువంటి ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని భారత మహిళా రెజ్లర్లు గతేడాదిగా నిరసనలు చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తమ ఆందోళనలను విరమించారు. అయితే తాజగా జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్నేహితుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో రెజ్లర్లు మళ్లీ నిరసన బాట పట్టారు.