రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ గెలుచేల చేస్తామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొన్నది. ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపింది. నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్ గెలుపు లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించింది. పద్నాలుగు లెపర్డ్ యుద్ధ ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ప్రకటన వచ్చింది. రష్యతో యుద్ధంలో గెలిచేలా సామగ్రి అందించడమే తమ మిత్ర దేశాల లక్ష్యం అని తెలిపింది. ఇప్పటికే యుద్ధం నేపథ్యంలో రష్యాకు అండగా నిలబడిన వాగ్నర్ సంస్థ పైన అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా కూడా ఎం1 యుద్ధ ట్యాంకులను పంపించనుంది.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని వెలుపల ఉన్న మరో పట్టణంపై రష్యా క్షిపణులతో దాడి చేసిన ఘటనలో 11 మంది మరణించారు. మరో 11మంది గాయపడ్డారు. రష్యా క్షిపణుల దాడితో ప్రజలు మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు.