సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ సినిమా అయిపోయిన తర్వాతే రాజమౌళి ప్రాజెక్ట్ మొదలు కానుంది. రీసెంట్‌గానే ఎస్ఎస్ఎంబీ28 రెగ్యూలర్ షూటింగ్లో జాయిన్ అయ్యాడు మహేష్ బాబు. ఇదిలా ఉంటే.. మహేష్‌తో రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. కథేంటి.. ఎప్పుడు మొదలు పెట్టనున్నారు.. హీరోయిన్ ఎవరు.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం.. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా రాజమౌళి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉన్నాడు రాజమౌళి. ఈ సందర్భంగా మహేష్ సినిమా ఏ జానర్లో తెరకెక్కనుందనే విషయంలో క్లారిటీ ఇచ్చారు. ‘మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ సినిమా చేయబోతున్నాని’ చెప్పారు రాజమౌళి. గ్లోబ్ ట్రాటింగ్ అంటే.. మహేష్‌తో భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేయబోతున్నాడని చెప్పొచ్చు. ఈ లెక్కన చూస్తే.. మహేష్ బాబుతో ఊహించని స్థాయిలో వరల్డ్ వైడ్ కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో.. పాన్ వరల్డ్ స్థాయిలో.. రాజామౌళి ఈ సినిమా చేయబోతున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో హాలీవుడ్ స్థాయిలో అట్రాక్ట్ చేసిన జక్కన్న.. మహేష్ బాబుతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.