»Dana Nagender Congress Has Fallen On The Defensive In The Assembly
Danam Nagender: అసెంబ్లీలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిపోయింది
శ్వేతపత్రాలు సభలో పెట్టడం ద్వారా ఏదో జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది, అలా చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రభుత్వం గ్రహించడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ మమ్మల్ని గెలికి తిట్టించుకుంటుందన్ని పేర్కొన్నారు.
Dana Nagender Congress has fallen on the defensive in the Assembly
Danam Nagender: తెలంగాణ అసెంబ్లీ( Assembly) వాడీవేడి చర్చలతో కొనసాగుతుంది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన అప్పులను, డొల్లా తనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్(Congress). అందుకు గాను అసెంబ్లీలో శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) స్పందిస్తూ.. ఇలా చేయడం ద్వారా కాంగ్రెస్ తమను గెలికిందని, దానికి మా మంత్రులు చెలరేగిపోయారని ఫలితంగా కాంగ్రెస్ అనుభవిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో డిఫెన్స్‌లో పడిపోయిందన్నారు. వారు ఇచ్చిన హామీలను, పథకాలను అమలు చేయకుండా శ్వేతపత్రాలు అనే అంశం తెరపై తీసుకొచ్చారని ఆరోపించారు. తమ విధులు నిర్వర్తించకుండా కాలక్షేపం చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు చేసిన అప్పులు బయటపడితే భవిష్యత్తులో ఏలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో వారికి తెలియదని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, కేటీఆర్‌ల మాటలకు కాంగ్రెస్ మంత్రులు బెంబేలెత్తి పోతున్నారన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టులపై హరీశ్ రావు అదరగొడుతున్నారని, గుక్కతిప్పుకోకుండా మాట్లాడితుంటే కాంగ్రెస్‌కు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని వెల్లడించారు. సభలో మంత్రులు అసలు విషయాలు మాట్లాడకుండా పైపైన మాట్లాడి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అనేది చిరకాల వాంఛ అని, ఆ పదవిని ఆయన అంత ఈజీగా వదులుకోరని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయమివ్వాలని కేసీఆర్ చెప్పారని వెల్లడించారు.