»Indian Stock Market Losses December 21st 2023 Sensex Loss 440 Points
Stock market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 440 పాయింట్లు లాస్
భారత స్టాక్ మార్కెట్లు నేడు తిరోగమనం దిశగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు పెద్ద ఎత్తున నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం లాభాల్లో కొనసాగుతుండటం విశేషం.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సహా పలు చిత్రాలు అన్ని సూచీలు నష్టాల్లోనే దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బిఎస్ఇ సెన్సెక్స్ ఒక దశలో 440 క్షీణించి 70,000.11 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ 84.45 పాయింట్లు పడిపోయి 21,065.70 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా 350 పాయింట్లు నష్టపోగా..47096 పాయింట్ల పరిధిలో ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం ఈ సూచీలకు విరుద్ధంగా లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్, సిప్లా, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, లార్సెన్ స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక పవర్ గ్రిడ్, మైండ్ ట్రీ, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
అయితే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల కారణంగా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కరోనా భయాందోళనలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరగడం సహా ప్రపంచవ్యాప్తంగా కూడా పలు చోట్ల పెద్ద ఎత్తున కోవిడ్ కేసులు పెరిగాయి. ఇలాంటి పతనాల మధ్య నాణ్యమైన స్టాక్‌లలో పెట్టుబడి అవకాశాలను పలువురు పెట్టుబడి దారులు అంచనా వేస్తున్నారు. మధ్య-కాల బుల్లిష్ ఔట్లుక్లకు అనుకూలమైన సాంకేతిక పరిస్థితుల మధ్య కీలక బెంచ్‌మార్క్‌లు ఏకీకృతం అయ్యే అవకాశం ఉన్నందున, సమీప కాలంలో అస్థిరత అంచనా వేయబడుతుంది.