శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. పంబా నది నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపివేస్తూ నిదానంగా దర్శనానికి పంపిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఇలా చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. భక్తుల్ని నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ కూడా చేశారు. దీంతో అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Kerala: A large number of devotees visited and offered prayers at Sabarimala Sree Dharma Sastha Temple, in Pathanamthitta. pic.twitter.com/rLtJD2m3qm
స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో ఐదు కంపార్టుమెంట్లు కిక్కిరిపోయాయి. దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. శబరిమల మార్గం మధ్యలోనే భక్తుల్ని గంటల తరబడి నిలిపివేస్తున్నారు. కానీ వేలాదిగా తరలివస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు కూడా లేకపోవటంతో నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిల్చుని ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. దాదాపు 10 గంటలకు పైగా భక్తులు మార్గ మధ్యలోనే నిల్చుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.