TPT: ఈనెల 30న సీఎం తిరుపతి, నాయుడుపేట పర్యటనతో పాటు గవర్నర్ 30, 31 తేదీల్లో తిరుపతి–తిరుమల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పర్యటన సజావుగా, భద్రంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పాల్గొన్నారు.