»Guntur Kaaram Team Is Overreacting Unnecessarily To Fans Feedback
Guntur Kaaram: అనవసరపు విషయాలపై రియాక్ట్ అవుతున్న గుంటూరు కారం టీమ్..!
ఏదైనా కొత్త మూవీ ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే, ఆ ప్రమోషన్ కంటెంట్ ని అందరూ పాజిటివ్ గా తీసుకోకపోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతూ ఉంటాయి. ఇది చాలా కామన్. మంచి హిట్ సినిమాలకు కూడా అలాంటి కామెంట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందరికీ పాట, ట్రైలర్ నచ్చకపోవచ్చు. అందరూ, దానిని మెచ్చుకోకపోవచ్చు. చాలా మంది దర్శక, నిర్మాతలు ఇలాంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ, గుంటూరు కారం మూవీ టీమ్ మాత్రం నెటిజన్ల అభిప్రాయంపై చాలా సీరియస్ గా తీసుకుంటోంది.
ఇప్పటి వరకు గుంటూరు కారం నిర్మాతలు టీజర్, పోస్టర్లు, దమ్ మసాలా పాటను విడుదల చేసారు. వీటిలో ప్రతి ఒక్కటి అభిమానులకు నచ్చింది . వారు బృందాన్ని మెచ్చుకున్నారు.రెండ్రోజుల క్రితం విడుదలైన ఓహ్ మై బేబీ పాట కి మాత్రం చాలా వరకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. నిరాశ చెందిన కొందరు హార్డ్కోర్ అభిమానులు మూవీ టీమ్ పై విమర్శలు కురిపించారు. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వినిపించడం కొత్తేమీ కాదు. ప్రతి సినిమాకీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరూ దానిపై స్పందించరు ఎందుకంటే తదుపరి కంటెంట్ బాగా పనిచేస్తే, అదే వ్యక్తులు దానిని అభినందిస్తారు.
గుంటూరు కారం టీమ్ మాత్రం ఈ పాటకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఫ్యాన్స్ పై ఎదురుదాడికి దిగుతున్నారు. నిన్న రామజోగయ్య శాస్త్రి, నేడు నిర్మాత నాగ వంశీ అభిమానులపై విరుచుకుపడ్డారు. ఈ మొత్తం అపజయం అనవసరంగా వార్తల్లోకి ఎక్కి సినిమాపై నెగిటివ్ బజ్ క్రియేట్ చేసింది. గుంటూరు కారం మూవీ టీమ్ నిజంగా అనవసర విషయాలపై ఎక్కువగా స్పందిస్తున్నారనిపిస్తోంది. ఈ రియాక్షన్.. తర్వాత మూవీ ఫలితం పై కూడా పడే అవకాశం ఉంది.