AP 10th, INTER Exams: ఏపీ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందు వల్ల ముందుగానే పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను పది, ఇంటర్ విద్యార్థుల (10th, INTER Exams) వార్షిక పరీక్షల షెడ్యూల్ నేడు విడుదలైంది. మార్చిలోనే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 18వ తేది నుంచి 30వ తేది వరకూ పదో తరగతి పరీక్షలు ఉంటాయని, మార్చి 1వ తేది నుంచి 15వ తేది వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటన చేసింది. ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు (Ap Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ముందుగానే ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
వార్షిక పరీక్షలకు మొత్తం 16 లక్షల మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులు హాజరుకానున్నట్లు విద్యాశాఖ నివేదిక తెలిపింది. ఇందులో 6 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించింది. పదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇకపోతే ఇంటర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు ఉంటాయని తెలిపింది.
ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5వ తేది నుంచి 25వ తేది వరకూ జరుగుతాయిని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒకటే రోజున మొదటి, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలు జరగవని, రోజు మార్చి రోజుల్లోనే పరీక్షలు ఉంటాయని ఆయన వెల్లడించారు. విద్యార్థులంతా బాగా చదివి పరీక్షలు రాయాలని, విద్యార్థులకు పరీక్షల సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుందని ఆయన తెలిపారు.