Keeravani కొడుకు శ్రీసింహ పెళ్లికి ముహూర్తం ఫిక్స్!
ప్రస్తుతం టలీవుడ్లో ఉన్న యంగ్ హీరోలంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీఠలెక్కుతున్నారు. రీసెంట్‌గానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతన్నాడు.
Shri Simha: దర్శక ధీరుడు రాజమౌళి అన్నయ్య, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీసింహా కోడూరి (Shri Simha) గురించి అందరికీ తెలిసిందే. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తునే ఉన్నాడు శ్రీసింహా. యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన శ్రీ సింహా.. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. చివరగా ‘ఉస్తాద్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అవుతున్నాడు. గత కొద్దిరోజులుగా ఈ పెళ్లి గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. మురళీ మోహన్ మనవరాలితో శ్రీ సింహ పెళ్లి అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మురళీ మోహన్ ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చారు.
‘నాకు ఒక కుమార్తే, కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. తనకి ఓ కూతురు ఉంది.. త్వరలోనే పెళ్లి జరగబోతుంది. ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో వివాహం జరగనుంది. అలాగే నా కుమారుడుకి కూడా ఒక కూతురు ఉంది. ఆమె పెళ్లి కూడా ఖాయమైంది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంట కోడలిగా వెళ్లనుంది. పెద్ద మనుమరాలి పెళ్లి కూడా ఫిబ్రవరిలోనే జరిగింది. ఈ పెళ్లి కూడా అదే నెలలోనే చెయ్యాలని అనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక మురళీ మోహన్ కొడుకు రామ్ మోహన్.. ఈయన ఏకైక కుమార్తె పేరు రాగ. ఇటీవలె ఆమె బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. దీంతో ప్రస్తుతం తమ సొంత బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోంది రాగ. ఇక ఇప్పుడు శ్రీసింహాతో పెళ్లికి రెడీ అవుతోంది. అయితే.. శ్రీసింహా, రాగది లవ్ మ్యారేజా? లేక అరెంజ్డ్ మ్యారేజా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.