Smita రె‘ఢీ’.. కొత్త ఛాలెంజ్‌కు సిద్దం అంటూ ట్వీట్.. వైరల్
ఛాలెంజ్‌కు రెడీ అంటున్నారు ఐఏఎస్ స్మిత సబర్వాల్. కేంద్ర సర్వీసులోకి వెళ్లాలని అనుకుంటోన్న ఆమెకు.. తెలంగాణ ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం లేదు.
Smita Sabharwal: ప్రభుత్వాలు మారగానే కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పడతారు. గత ప్రభుత్వంలో ఆజమాయిసీ చేసి.. ఆ తర్వాత గమ్మున ఉండాల్సి వస్తోంది. మరికొందరు విచారణను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉంది.
గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన స్మిత సబర్వాల్ (Smita Sabharwal) చడీ చప్పుడు లేదు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఆ తర్వాత నీటి పారుదల రివ్యూ మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. ఇప్పుడెమో కొత్త ఛాలెంజ్‌కు సిద్దం అని ట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అప్పట్లో గట్టిగా మాట్లాడారు.
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది. అక్రమాలపై రివ్యూ చేస్తున్నారు. అందుకే కాబోలు.. స్మిత (Smita)అలా స్పందించారు. రాష్ట్రంలో ఉండటం ఇష్టం లేకున్నా.. కేంద్ర సర్వీసులోకి వెళ్లాలని అనుకున్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం స్మిత సబర్వాల్‌కు నో అబ్జెక్షన్ సర్టిపికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా పీఠముడి నెలకొనే అవకాశం ఉంది. అందుకే స్మిత ఘాటుగా స్పందించారని ఆమె సన్నిహితులు అంటున్నారు.
గత ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఆ రెండింటిలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అక్రమాల్లో అధికారులకు వాటా ఉందనే రూమర్స్ వినిపించాయి. ఆ క్రమంలో విచారణ తథ్యం అని.. అందుకే స్మిత ఘాటుగా ట్వీట్ చేశారని మరికొందరు అంటున్నారు. స్మిత చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది.
Some pics remind us how far we have come.. through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will!