CM KCR: యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. చేతులెత్తేసిన పోలీసులు
సోమాజిగూడ యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాత్ రూంలో కిందపడిన కేసీఆర్ కు ఆ ఆస్పత్రిలోనే శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖ నేతలు వచ్చి వెళ్తున్నారు.
CM KCR: సోమాజిగూడ యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాత్ రూంలో కిందపడిన కేసీఆర్ కు ఆ ఆస్పత్రిలోనే శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖ నేతలు వచ్చి వెళ్తున్నారు. అయితే.. ఇటీవల కేసీఆర్ను చూసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆస్పత్రి ఎదుట జై కేసీఆర్, జై రామన్న నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉండడంతో పోలీసులు సైతం ఏం చేయలేక చేతులెత్తేశారు. దీంతో యశోద ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిలా ఉండగా అటుగా వెళ్లే సామాన్యులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అంతేకాకుండా.. ఆస్పత్రికి వచ్చే రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేసేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు.
ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ ఓ వీడియో సందేశాన్ని తన అభిమానుల కోసం విడుదల చేశారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించాలని కోరారు. యశోద ఆస్పత్రి వద్దకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు. తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరం తో చేతులు జోడించి మొక్కారు.