రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ అప్టేడ్ ప్రకారం.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం పెట్టేశారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే రాజమౌళి సినిమా మొదలవ్వలాంటే.. ముందుగా త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది మహేష్ బాబు. ఇక ఎప్పటి నుంచి అదిగో, ఇదిగో అంటు వస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్.. ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చేసింది. ఈ సినిమా కేవలం 7, 8 నెలలే టార్గెట్ పెట్టుకొని.. వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. అయితే మహేష్ మాత్రం ఈ ఇయర్ ఎండింగ్ వరకు తన షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసి.. వెంటనే రాజమౌళి సినిమా కోసం రెడీ అవాలని చూస్తున్నాడు.
ఇక ఎలాగు త్రివిక్రమ్ సినిమా మొదలైపోయింది కాబట్టి.. ఇప్పుడు రాజమౌళి సినిమా ముహూర్తం గురించి చర్చ జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 2023 జనవరి 26న గ్రాండ్‌గా ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత వెంటనే రెగ్యూలర్ షూట్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ లోపు రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లోను స్క్రిప్టు పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేయనున్నారట. అయితే నిజంగానే మహేష్, రాజమౌళి సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిందా లేదా అనేది.. త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇకపోతే శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మించనున్న ఈ సినిమా.. ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా.. విజువల్ గ్రాండియర్‌గా రూపొందనుంది.