»Komatireddy Venkat Reddy Warning To Cinema Industry
Komatireddy venkat reddy: సినిమా వాళ్లకు మంత్రి కోమటి రెడ్డి వార్నింగ్?
తెలంగాలో కొత్తగా ఈరోజు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో పలు శాఖల పనుల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
komatireddy venkat reddy warning to cinema industry
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నల్గొండ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(komatireddy venkat reddy)కి మంత్రివర్గంలో చోటు దక్కడంతో పాటు సినిమాటోగ్రఫీ, ఆర్ అండ్ బీ శాఖలను కేటాయించారు. ఆదివారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో వేద పండితుల ఆశీస్సుల మధ్య మంత్రి హోదాలో ఆయన తన కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ వేడుకకు వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.
అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు(dil raju) తప్ప మరెవరూ తనకు ఫోన్ చేయలేదని వెల్లడించారు. అయితే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంటే సినిమా వాళ్లు తనను గుర్తించాలని మంత్రి కోరుకున్నారని పలువరు చెబుతుండగా..ఇంకొంత మంది మాత్రం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(komatireddy venkat reddy) సినిమా వాళ్లకు వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ వ్యాఖ్యల విషయంలో సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. మరోవైపు తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ సమయాన్ని రెండున్నర గంటలకు తగ్గించే పనులపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వెంకట్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(nitin gadkari)ని కలుస్తానని, హైదరాబాద్-విజయవాడను ఆరు లేన్ల హైవేగా విస్తరించేందుకు ఆమోదం తెలపాలని కోరతానని చెప్పారు. తెలంగాణలోని హైవే ప్రాజెక్టులకు సంబంధించి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించడానికి, గడ్కరీని కలవడానికి సోమవారం న్యూఢిల్లీకి వస్తానని వెంకట్ రెడ్డి చెప్పారు. 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. వీటిలో మల్లేపల్లి-నల్గొండ మరియు రీజినల్ రాంగ్ రోడ్ (RRR) సౌత్-చౌటుప్పల్-అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి ఉన్నాయి. జాతీయ రహదారి 765లోని హైదరాబాద్-కల్వకుర్తి సెక్షన్‌ను నాలుగు వరుసలుగా మార్చాలనే డిమాండ్‌ను కూడా లేవనెత్తారు.