Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. రాజ్ భవన్లో రాత్రి 7 గంటలకు సీఎంగా ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎంపికపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదన పంపింది. ఆ తీర్మానాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా, తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు. భట్టి విక్రమార్క, సీతక్క పలువురు బలపరిచారు.
రాష్ట్ర నాయకత్వం పంపిన ప్రతిపాదనను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పరిశీలించారు. ఇతరుల అభిప్రాయం తీసుకొని రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న డీకే శివకుమార్‌కు సమాచారం అందించారట. దాంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమ పనులు మరింత వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.