BJP Mp laxman: బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ (BJP Mp laxman) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి నిధులు దారి మళ్లుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానులను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మప్రచారం కోసం వినియోగించాలని స్పష్టంచేశారు.
భక్తులు ఇచ్చే విరాళాలు దేవుని కైంకర్యాలకు ఉపయోగిస్తే మంచిదని లక్ష్మణ్ అన్నారు. తిరుపతి నగర అభివృద్ధికి ప్రభుత్వ నిధులు.. లేదంటే నగరపాలక సంస్థ నిధులను ఉపయోగించాలని సూచించారు. తిరుపతి డెవలప్ కోసం టీటీడీ నిధులు వాడొద్దని కోరారు. భక్తులు సమర్పించిన కానుకలు ఆలయం కోసమే ఖర్చు చేయాలని అభిప్రాయ పడ్డారు.
అదేవిధంగా ప్రాచీన నిర్మాణాల కూల్చివేతల్లో కూడా భక్తుల మనోభావాలను గౌరవించాలని లక్ష్మణ్ కోరారు. పార్వేట మండపం పునర్ నిర్మించే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పురావస్తు శాఖను సంప్రదించిందో లేదో భక్తులకు తెలియజేయాలని కోరారు. అలా చేయకుండా.. సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. పాలక మండలి, ఏపీ సర్కార్ లక్ష్యంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. మరి దీనిపై టీటీడీ, ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.