సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ఉదయమే గిరిజన బాలికల హాస్టల్‌ను మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వసతి, భోజనం, నీటి సరఫరా, పరిశుభ్రత వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలు సూచించారు. భద్రత, వంటగది శుభ్రత, వైద్య పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.