తెలంగాణలో కౌంటింగ్‌కు ముందు కాంగ్రెస్ హడావుడి ఎక్కువైంది. అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ కేబినెట్ మీటింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేయనుంది. అలాగే తెలంగాణలో ప్రభుత్వ నిధుల తరలింపు జరుగుతోందని ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసీని కలిసేందుకు బయల్దేరారు. డిసెంబర్ 4న బీఆర్ఎస్ పార్టీ కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆ ప్రకటన చేయడంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుపడంతో కాంగ్రెస్ నేతలు ఎలక్షన్ కమిషన్‌ను కలిసేందుకు బయల్దేరారు. డిసెంబర్ 3వ తేదిన కౌంటింగ్ జరగనున్న తరుణంలో 4వ తేదిన కేబినెట్ సమావేశంపై వారు ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాకుండా నిధులను మళ్లింపు కూడా జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే అవకాశం ఉందనే కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అసైన్డ్ భూముల విషయంలో కూడా ఏదో జరుగుతోందనే సమాచారం తమకు వచ్చిందని, ప్రభుత్వ లావాదేవీలపై గట్టి నిఘా ఉంచాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్‌ను కోరనున్నారు. అందుకే ఆయన తన బృందంతో కలిసి ఈసీ వద్దకు బయల్దేరారు. మరికాసేపట్లో ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత హీటెక్కింది. కౌంటింగ్‌కు ముందు మరో కాంగ్రెస్ హడావుడిని చూసి మరికొందరు నోరుపారేసుకుంటున్నారు. వారి మాటలను కొట్టిపారేస్తూ ఈసారి తమదే విజయమని కాంగ్రెస్ నేతలు ఖాయం చేసుకుంటున్నారు.