నిన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల పోలింగ్లో హైదరాబాద్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా జరిగింది. అయితే ఈ అంశంపై టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇతని కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Director harish shankar Funny Reason For Low Voter Turnout telangana assembly election 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నిన్న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా జరగడం గమనార్హం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సగటు ఓటింగ్ శాతం 73.7 శాతం కాగా, 2023 ఎన్నికలలో ఇది 70.66 శాతం నమోదైంది. అంతేకాదు హైదరాబాద్లో(hyderabad) 50 శాతం కంటే పోలింగ్ నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో పోలింగ్ ముగిసే సమయానికి కేవలం 70.66 పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈ పోలింగ్ శాతం ఎందుకు తక్కువ అనే దానిపై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే దర్శకుడు హరీష్ శంకర్(harish shankar) దీనిని విశ్లేషేస్తూ ఓ కామెంట్ చేశాడు. అయితే, ఆయన చెప్పిన రీజన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్(voting) శాతం ఎందుకు తగ్గిందని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. వీకెండ్ ముందు ఎన్నికల రోజు శుక్రవారం సెలవు పెట్టేసి లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకుని చాలా మంది స్టేషన్ బయటికి వెళ్లారని హరీశ్ బదులిచ్చారు. ఈ కామెంట్లు పూర్తిగా ఫన్నీగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఇది నిజం కావచ్చని అనిపిస్తుంది. ఓటు వేయడానికి అన్ని హక్కులు, అర్హతలు ఉన్న చాలా మంది ఓటర్లు వివిధ కారణాల వల్ల తమ ఓటును వినియోగించుకోలేదు. కొందరు సెలవులో ఉన్నారు.
మరోవైపు సినీ ప్రముఖులు(cinema celebrities) తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయడానికి మంచి ఉద్దేశాన్ని ప్రదర్శించారు. కొంతమంది యువకులను వెళ్లి ఓటు వేయడానికి ప్రయత్నించారు. మెగాస్టార్ చిరు, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ తదితర హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే బయల్దేరి వెళ్లారు. అసలే ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. మరి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే, మరో రెండు రోజులు ఎదురు చూడాల్సిందే.