Vijayakanth: అత్యంత విషమంగా హీరో విజయకాంత్ ఆరోగ్యం
తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అత్యంత విషమంగా ఆయన ఆరోగ్యం ఉందని, మరో 14 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ (DMDK Party) అధినేత విజయకాంత్ (Vijayakanth) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు బులిటెన్ విడుదల (Health Bulletin Release) చేశారు. చెన్నైలోని మయత్ ఆస్పత్రి (MIOT international Hospital)లో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం నిలకడగా లేదని, పరిస్థితి విషమంగా ఉందని నివేదిక విడుదల చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో నవంబర్ 18న ఆస్పత్రిలో చేరారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి కారణంతో ఆయన ఆస్పత్రికి వెళ్తున్నట్లుగా అప్పట్లో డీఎండీకే పార్టీ వెల్లడించింది.
సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారని, రెండు మూడు రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వచ్చేస్తారని, వదంతులను ఎవ్వరూ నమ్మొద్దని డీఎండీకే పార్టీ (DMDK Party) అప్పట్లో స్పష్టం చేసింది. అయితే ఆస్పత్రిలో చేరిన వెంటనే ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. నవంబర్ 20న డీఎండీకే పార్టీ ఆ వార్తలను ఖండించింది. తొమ్మిది రోజుల తర్వాత నేడు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై మయత్ హాస్పిటల్ యాజమాన్యం హెల్త్ బులిటెన్‌ను (Health Bulletin) విడుదల చేసింది.
హెల్త్ బులిటెన్ (Health Bulletin)లో మయత్ ఆస్పత్రి షాకింగ్ విషయాలను వెల్లడించింది. విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని, అయితే గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేదని, పల్మనరీ చికిత్సలో సాయం కావాలని తెలిపింది. ఆయన ఇంకా 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి నిరంతర చికిత్స చేయించుకోవాలని స్పష్టం చేసింది. అనారోగ్య కారణాల (Health Problems) వల్ల ఆయన రాజకీయాల్లో యాక్టీవ్‌గా లేరు. అయితే ఆయన భార్య ప్రేమలత విజయ ప్రభాకరన్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇకపోతే విజయకాంత్ (Vijayakanth) చివరిసారిగా డీఎండీకే కార్యాలయంలో వాలంటీర్లతో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. వీల్ చైర్ మీద కూర్చొబెట్టి ఆయనకు బర్త్ డే వేడుకలు (Birth Day Celebrations) చేశారు. ప్రస్తుతం విజయకాంత్‌ను ఐసీయూ (ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి రావాలని కుటుంబీకులు, అభిమానులు, డీఎండీకే పార్టీ నేతలు కోరుకుంటున్నారు.