Ram Charan: హఠాత్తుగా హైదరాబాద్‌కి మెగా పవర్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హైదరాబాద్ చేరుకున్నారు. మైసూర్లో జరుగుతోన్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని సిటీ వచ్చేశారు. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ (Ram Charan) స్పెషల్ ప్లైట్‌లో హైదరాబాద్ వచ్చేశారు. ఇటీవల తన మూవీ గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం మైసూర్ వెళ్లారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఆ వెంటనే సిటీకి వచ్చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు రామ్ చరణ్ తేజ (Ram Charan) హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్ని పనులు ఉన్నా.. ఓటు వేయాలని ప్రముఖులు అవగాహన కల్పిస్తున్నారు. సెలబ్రిటీలు షూటింగ్ మానేసి, సిటీకి వస్తున్నారు. సో.. దూరంగా ఉన్నామనే కారణం చూపేవారు చెర్రీని ఉదహరణగా తీసుకోవాలి.
గేమ్ ఛేంజర్ మూవీని ప్రముఖ దర్శకుడు శంకర్ (shanker) తెరకెక్కిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ మూవీకి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ శంకర్- చెర్రీ చేయడంతో హైప్ నెలకొంది.