»The Price Of A Bed Share In A Rented Room In Canada Is 54 Thousand
Viral News: వామ్మో..రూమ్‌లో ఒక బెడ్ అద్దె రూ.54 వేలా!
సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యే వార్తలు కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని నోరు తెరిచేలా చేస్తాయి. అద్దె ఇళ్ల గురించి తెలిసిందే. ఏరియాను బట్టి రేట్లు ఉంటాయి. కానీ ఈ అద్దె రూమ్‌లో బెడ్ ధర తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
The price of a bed share in a rented room in Canada is 54 thousand
Viral News: సోషల్ మీడియా(Social Media) ప్రభావం పెరిగిన తరువాత చాలా విషయాలు ప్రపంచమంతా ఇట్టే తెలిసిపోతున్నాయి. హస్యం నుంచి విషాదం వరకు అన్ని వార్తలు తెగ ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ అద్దె రూమ్ బెడ్ షేర్ ధర(Bed Share) అక్షరాల రూ.54 వేలు. ఇది తెలిసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. నిజానికి భారతీయులకు ఈ బెడ్ షేర్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ విదేశాల్లో చదువుల కోసం వెళ్లిన వారికి, వారి రిలేషన్స్‌కు తెలిసే అవకాశం ఉంటుంది.
మాములుగా మనం రూములు అద్దెకు తీసుకుంటాం. కానీ ఫారెన్‌లో అది చాలా ఎక్స్ పెన్సీవ్ కాబట్టి గదిలో ఉండే బెడ్లను అద్దెకు ఇస్తుంటారు. ఒక బెడ్‌కు రూ.54 వేలు మరి ఎక్కువ కదా అనే అనుమానం వస్తుంది. అంత డబ్బుతో ఏ టాప్ సిటీలోనైనా రూమే అద్దం తీసుకొవచ్చని పలువురు భావిస్తారు. టొరెంటోకి చెందిన ఒక మహిళ ఫేస్బుక్లో ఈ పోస్ట్ పెట్టింది. షేర్ చేసుకోవడానికి క్వీన్ సైజ్ బెడ్ రూమ్ ఉంది. కేవలం నెలకు 900 కెనడియన్ డాలర్లు(రూ. 54 వేలు) మాత్రమే అని రాసుకొచ్చింది. దీనిపై నెటిజనులు స్పందించారు. ఇది ఎక్కువ అని కొందరు అంటుంటే, అంత ఉండడంలో ఆశ్చర్యం ఏమి లేదని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపై మీరెమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.