»Thandel First Look Of Naga Chaitanya And Chandu Mondetis Film
Naga Chaitanya తండేల్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
అక్కినేని నాగచైతన్య, యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం తండేల్. మత్స్యకారుడిగా నటిస్తున్న సినిమా నుంచి లేటెస్ట్గా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Naga Chaitanya: యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. కేవలం ఒకే జోనర్‌కు పరిమితం అవకుండా తన అభిమానులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ తర్వాత మళ్లీ సాలిడ్ హిట్ పడలేదు. ప్రస్తుతం దానికోసమే కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటి(Chandu Mondeti)తో మరోసారి చేతులు కలిపాడు. ప్రేమమ్ అనే మలయళ రీమేక్ సినిమాను అదే పేరుతో తెరకెక్కించి కల్ట్ క్లాసిక్ పేరుతో పాటు, బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టారు. తరువాత రెండవ సారి సవ్యసాచి తీసి బోల్తాపడ్డారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తండేల్ చిత్రంలో ఇంటెన్స్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
చైతన్య కెరియర్లో 23వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా తండేల్ కోసం చాలా శ్రమిస్తున్నాడు. ఇందులో మత్స్యకారుడిగా నటిస్తున్నారు. ఓ అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుందని తెలుస్తోంది. దాని కోసం నేచురల్ బ్యూటీ, ట్యాలెంటెడ్ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. చైతన్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్ నిర్మిస్తుంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.