»Tummala Nageswara Rao Said That Crores Of Bets Are Being Made On Khammam Assembly Election
Tummala Nageswara Rao: ఈ ఎన్నికపై కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి!
ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నికల హీట్ పెరిగింది. బీఆర్ఎస్ అరాచకపాలను అంతం చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నాడు. అంతే కాదు ఈ ఎన్నికల కోసం కోట్లల్లో బెట్టింగులు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tummala Nageswara Rao said that crores of bets are being made on Khammam assembly election
Tummala Nageswara Rao: ఖమ్మం(Khammam) జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గంలో కాాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ఎన్నికల ప్రచారాన్ని తీవ్రంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కురవి మండలం బలపాల గ్రామస్థులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఇద్దరిని రాజకీయాల్లో ప్రోత్సహించింది దివంగత ఎన్టీఆరే అని తెలిపారు. ఆయన మంత్రిగా పనిచేసినా, ఎమ్మెల్యేగా పనిచేసినా ప్రజల అభివృద్ధికోసమే అని వ్యాఖ్యనించారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ ఆశీస్సులతోనే ఇంతకాలం ప్రజా జీవితంలో ఉన్నామని వెల్లడించారు. మొదటి సారే వెంగళరావు కుటుంబంపై ఎన్టీఆర్ నిలబెట్టారని తుమ్మల తెలిపారు. ఆయన రాజీకీయ జీవితంలో బలపాల గ్రామస్థులు ఎప్పుడూ అండగా ఉన్నారని తెలిపారు.
ఖమ్మంలో సీపీఐ నాయకులు ఎంత మంది ఉన్నా ఇంతకాలం గౌరవప్రదమైన రాజకీయాలు చేశానని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలు ప్రేమాభిమానం కారణంగానే 40 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అరాచకాలు ఎక్కువయ్యాయని, వీరి అవినీతికి చరమగీతం పాడాలని ప్రజలను కోరారు. దానికోసం నవంబర్ 30న ఈవీఎం బటన్ నొక్కి బీఆర్ఎస్(BRS)కు బుద్ధి చెప్పాలన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని, దానికోసం ఫైట్ చేస్తానని పేర్కొన్నాారు. రాష్ట్రంలో ఎక్కడ లేని ఉత్కంఠ ఒక ఖమ్మంలోనే ఉందని, అందుకే ఇక్కడి ఎన్నికపై కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.