కామారెడ్డి: జుక్కల్లోని రెండు పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే వదంతులు వ్యాపించడంతో బుధవారం సాయంత్రం నుంచే వినియోగదారులు బంకులకు పోటెత్తారు. పోటీపడి ఇంధనాన్ని నింపుకోవడంతో రాత్రికే నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. దీంతో ఉదయం నుంచి పెట్రోల్ కోసం వస్తున్న వాహనదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.