యాదాద్రి: భువనగిరి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. సలీంను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.