HYD: నగర పరిధిలోని కార్ఖానా, ఉప్పల్, నారాయణగూడ ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాటర్ బాటిల్స్, క్యాన్లు, ఫ్యూయల్ క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్న ఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భద్రతా నిబంధనలు పట్టించుకోకుండా ఇంధనాన్ని నిల్వ చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రవాణాను అరికట్టాలని స్థానికులు కోరారు.