Trisha: నటి త్రిషపై (Trisha) మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్ల దుమారం కొనసాగుతోంది. కోలీవుడ్ స్టార్స్ ఇప్పటికే త్రిషకు (Trisha) అండగా నిలిచారు. టాలీవుడ్ నుంచి నటుడు నితిన్ మద్దతుగా నిలువగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది.
మన్సూర్ కామెంట్స్ సరికాదు. ఓ ఆడబిడ్డ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఖండించాల్సిన అవసరం ఉంది. నటి త్రిష కాదు ఇతరుల పట్ల కూడా ఇలాంటి కామెంట్స్ హేయనీయం.. త్రిషకు అండదండగా ఉంటాననని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
సెలబ్రిటీలు త్రిషకు అండగా నిలవడంతో మన్సూర్ దిగివస్తారెమో చూడాలి. ఓ మూవీలో రేప్ సీన్ ఉండగా.. ఆ సీన్ తీసివేశారు. త్రిషతో రేప్ సీన్ తాను మిస్ అయ్యానని మన్సూర్ నోరు జారారు. దీనిపై వెంటనే త్రిష స్పందించారు. ఆడవారి పట్ల ఇలా స్పందిస్తారా అని ధ్వజమెత్తారు. ఆ వెంటనే హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు.