లైగర్ సినిమా గురించి ఇంకా ఏదో ఒక వార్త వినిపిస్తునే ఉంది. అసలు లైగర్ మూవీ ఎఫెక్ట్ ఎవరి పై పడింది.. ఎవరికి నష్టం.. అనేది ఇంకా టాక్ ఆఫ్ ది టౌన్‌గానే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లైగర్ ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఆశలన్నీ ఆవిరైపోయాయి. పూరి జగన్నాథ్ మూడేళ్ల శ్రమకు లైగర్ భారీగా దెబ్బేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే లైగర్ మూవీ.. పూరి, రౌడీ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ దెబ్బకు పూరి, చార్మికి భారీ నష్టాలు తప్పవని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇందులో నిజం లేదనేది లేటెస్ట్ న్యూస్. అంతేకాదు లైగర్ వల్ల పూరికి లాభాలే తప్పా నష్టాలు లేదనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు దాదాపు 60 కోట్ల బడ్జెట్ పెట్టారట.. అయితే రిలీజ్‌కు ముందే 90 కోట్ల బిజినెస్ చేసింది లైగర్.
ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్ అదనపు లాభమని అంటున్నారు. మొత్తంగా లైగర్ వల్ల మేకర్స్‌కు ఎలాంటి నష్టం లేదని టాక్. కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం భారీ స్థాయిలో నష్టపోయినట్లు తెలుస్తోంది. దాంతో పూరి సెటిల్మెంట్స్ చేస్తున్నాడని వినిపించినా.. ఇప్పటి వరకు అది జరగలేదని ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు విజయ్ దేవరకొండకి కూడా బాగానే నష్టం జరిగిందని అంటున్నారు. అసలు రౌడీ ఈ సినిమా కోసం అందుకున్నది 6, 7 కోట్లేనట. ఒకవేళ సినిమా హిట్ అయితే రౌడీ 35 కోట్ల వరకు తీసుకోవాల్సింది. కానీ ఇప్పుడు ప్లాప్ వల్ల విజయ్ మిగతా పారితోషికం వదులుకున్నాడట. ఇలా లైగర్ వల్ల రౌడీకే భారీ నష్టం జరిగిందని అంటున్నారు. ఇక లైగర్ దెబ్బకు రౌడీ ఆశలన్నీ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘ఖుషి’ మూవీ పైనే ఉన్నాయి. మరి రౌడీకి ఈ సినిమా పాన్ ఇండియా స్టార్ డమ్ ఇస్తుందేమో చూడాలి.