ఉగ్రవాదులు, భద్రతా దళాలకు దాదాపు 20 గంటలపాటు కొనసాగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో భారత దళాలు దీటుగా ఎదుర్కొన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్(Jammu kashmir )లోని కుల్గామ్ జిల్లా(Kulgam district) సామ్నులో చోటుచేసుకుంది.
Encounter in Jammu kashmir Five terrorists killed Samna of Kulgam district
జమ్మూకశ్మీర్(Jammu kashmir)కుల్గామ్ జిల్లా సామ్నులో ఉగ్రవాదులపై కొనసాగుతున్న చర్యల్లో భాగంగా భారత భద్రతా బలగాలు విజయం సాధించాయి. సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లో భద్రతా దళాల రెండో రోజు ఆపరేషన్‌లో భాగంగా ఇది చోటుచేసుకుంది. కుల్గాం పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ క్రమంలో ఘటనా స్థలం నుంచి అభ్యంతరకర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఏడీజీపీ తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ చివరి దశలో ఉందని చెప్పారు. ఆ ప్రాంతమంతా శానిటైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Srinagar, J&K: On 5 terrorists being killed in Kulgam encounter, IGP Kashmir Vidhi Kumar Birdi says “Security Forces got an intelligence input regarding the movement of some terrorists in Kulgam. During the search operation, a terrorist fired from a house after which an… pic.twitter.com/ogwjjUJfxG
అంతకుముందు కుల్గామ్‌లోని దమ్హాల్ హంజి పోరా ప్రాంతంలో గురువారం ఎన్కౌంటర్(Encounter) ప్రారంభమైందని కాశ్మీర్ జోన్ పోలీసులు X (ట్విట్టర్) పోస్ట్ ద్వారా తెలిపారు. ఇక్కడ భద్రతా బలగాలు నిన్నటి నుంచి కొందరు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఆ క్రమంలో ఇరువర్గాల నుంచి నిరంతరం కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు 20 గంటల్లో ఉగ్రవాదులందరినీ హతమార్చాయి. మొదట ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను హతమార్చగా, కొంతసేపటికే మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల స్థావరంలా పనిచేస్తున్న ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా, మరొకటి పాక్షికంగా దెబ్బతిన్నది. హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబా హిట్ స్క్వాడ్ అని కూడా పిలువబడే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్‌ఎఫ్‌కు చెందినవారిగా గుర్తించారు. మరోవైపు ఉగ్రవాదుల స్థావరం పక్కనే ఉన్న ఇతర ఇళ్లలో ఉన్న దాదాపు 30 మందిని సైనికులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.