»Nara Lokesh Should Release Demand Rs 1650 Crore Dues Of Students Pending Scholarships
Nara Lokesh: రూ.1650 కోట్ల విద్యార్థుల బకాయిలు రిలీజ్ చేయాలి
ఏపీలో లక్షల మంది విద్యార్థులకు ఇంకా ఫీజు బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని నారా లోకేష్(nara lokesh) గుర్తు చేశారు. ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న రూ.1650 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు.
nara Lokesh should release demand Rs 1650 crore dues of students pending scholarships
ఆంధ్రప్రేదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(nara lokesh) అన్నారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.1650 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆ నిధులను వైసీపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లోకేష్ లేఖ రాశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై అనేక నెలలు కావాస్తున్నా కూడా ఫీజు బకాయిలు మాత్రం ఇంకా చెల్లించలేదన్నారు. ఇలాంటి క్రమంలో ఫీజులు చెల్లించకపోవడం వల్ల పలు కాలేజీలు విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతించడం లేదన్నారు.
మరోవైపు చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులను(students) సైతం ఆయా కాలేజీల యాజమాన్యాలు ఎగ్జామ్స్ రాయనివ్వడం లేదని ప్రస్తావించారు. దీంతోపాటు పలువురు చివరి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. అలాంటి వారికి పై చదువులు చదవాలన్నా, ఉద్యోగ పరీక్షలకు అప్లై చేయాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. ఇలా అనేక విధాలుగా రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఫీజు బకాయిల(pending scholarships) విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
2020-21 విద్యా సంవత్సరానికి రూ.600 కోట్లు, 2022-23కు రూ.600 కోట్లు ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సి ఉందన్నారు. నాలుగేళ్లుగా పీజీ కోర్సులకు సంబంధించి రూ.450 కోట్లు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. అయితే టీడీపీ ప్రభుత్వ హాయాంలో మాత్రం పీజీ కోర్సులకు సకాలంలో ఫీజులు చెల్లించినట్లు గుర్తు చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక నిధులను నిలిపేసినట్లు చెప్పారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఒక్క ఏడాది కూడా విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించడం లేదని నారా లోకేష్ అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన అంటూ ప్రకటించిన పథకాలు ప్రచారమే తప్ప వాటి వల్ల జరిగింది శూన్యమేనని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.