ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఆమాాడ దూరంలో ఉందని, రౌడీల, గూండాల చేతుల్లో రాష్ట్రం అల్లాడిపోతుందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నాడు. జనసేనతో పొత్తుగురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్, తాను ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తులమని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు జనాల్లోకి తీసుకెళ్తామని అన్నారు.
Jana Sena TDP started change Pawan Kalyan Balakrishna is a straight man
Balakrishna: టీడీపీ(TDP), జనసేన(Janasena) పొత్తు కొత్త శకానికి నాంది అని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ(Balakrishna) పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో గురువారం పర్యటించిన క్రమంలో మీడియాతో మాట్లాడారు. ఈసారి ఇన్ని సీట్లు, అన్ని సీట్లు కాదు టీడీపీ-జనసేన గెలవాలన్నారు. తాను, పవన్ కల్యాణ్(Pawankalyan) ముక్కుసూటిగా మాట్లాడుతామని, ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలను జానల్లోకిి బలంగా తీసుకెళ్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి శూన్యం అని పేర్కొన్న బాలకృష్ణ రాష్ట్రం మొత్తం నేరస్థులు, హంతకుల చేతుల్లోనే ఉందన్నారు. ఇలాంటి పరిపాలన అంతం కావాలంటే ప్రజలంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఒక్క హిందూపురంలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా అభివృద్ధి పనులు చేస్తున్నామని, ప్రభుత్వంలో ఉన్న వైసీపీ మాత్రం కాలయాపన చేస్తున్నారని బాలకృష్ణ విమర్శించారు.
అలాగే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించిన బాలకృష్ణ సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అందులో సరైన సౌకర్యాలు లేవని రోగులు చెప్పడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను బాలకృష్ణ నిలదీశారు. ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, వైద్య పరికరాలు లేవు, ఉన్న వాటిని వాడుకోవటం లేదన్నారు. గతంలో తాను ఇచ్చిన వెంటిలేటర్లను ఉపయోగించడం లేదని, వాటిని అలా మూలన పడేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ గ్రాంట్లు ఇచ్చినా వాటిని మళ్లించారని ఈ విషయంలో ప్రభుత్వం ఫైన్ కూడా కట్టిందని బాలకృష్ణ వెల్లడించారు.