Heroine Kriti Sanon Speaks About Nepotism In Bollywood
Kriti Sanon: సినీ ఇండస్ట్రీలో నెపోటిజం కామన్.. నిర్మాతలు, దర్శకులు.. తమ పిల్లలు, తెలిసిన వారికి అవకాశాలు ఇస్తుంటారు. అయితే ఒకప్పటిలా లేదు.. పరిస్థితులు మారాయని అంటోంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon). ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. బీ టౌన్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు పడ్డారు. తనకు వచ్చిన ఆఫర్స్‌ను స్టార్ కిడ్స్ గద్దలా తన్నుకెళ్లారని అప్పట్లో ఆరోపించారు. నెపోటిజం గురించి అప్పట్లో కూడా మాట్లాడారు.
ఇప్పుడు మరోసారి స్పందిస్తూ.. ఇండస్ట్రీలో ఒకప్పటిలా పరిస్థితులు లేవని చెప్పారు. గతంలో వారి పిల్లలకే ఛాన్స్ ఇచ్చే వారు. ఇప్పుడు ప్రతిభను చూసి, పాత్రల ఎంపిక జరుగుతుందని చెప్పారు. పెద్ద స్టార్ల కన్నా కూడా టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ఇలానే కొనసాగితే చక్కటి వాతావరణం ఉంటుందని, అందరికీ సమాన అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. యువతలోని టాలెంట్ ప్రపంచం చూసే అవకాశం ఉంటుందని తెలిపారు.
కృతి సనన్ (Kriti Sanon) హీరోయిన్గా బిజీగా ఉన్నారు. నిర్మాణ రంగంలోకి అడుగిడారు. ఓటీటీ వేదికగా పలు సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇటు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. సమయం కుదిరితే చాలు నెపోటిజం గురించి మాట్లాడతారు.0 0తనలా ఇండస్ట్రీకి వచ్చేవారికి చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.